జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు రావడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకోలేక కారులోనే చిక్కుకొని మృతి చెందాడు.
మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న నంద్యాల తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. మృతి చెందిన వ్యక్తి నంద్యాల ఎస్‌బీఐ బ్యాంక్ క్లర్క్ శివ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మృతుని తల్లి వైద్య చికిత్స కోసం కర్నూలుకు వెళ్లి మంగళవారం అర్థరాత్రి తిరిగి నంద్యాలకు వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.