ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మధుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కారు, ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. హర్యానాకు చెందిన మనోజ్‌, బబితా, అభయ్‌, హేమంత్‌, ఖన్ను, హిమాద్రి, రాకేష్‌లు కారులో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు బయలుదేరారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కారు యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వెళుతోంది.

ఈ నేపథ్యంలో కారు టైరు పేలి నోయిడానుంచి ఆగ్రా వైపు వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.దీంతో కారు నుజ్జునుజ్జయి అందులోని ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.