ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 21మంది తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు అదుపు తప్పి గ్యాస్‌ ట్యాంకర్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.