హైదరాబాద్‌లో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. 12 గంటల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూవీ టవర్స్ వద్ద సోమవారం మధ్యాహ్నం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట నుంచి భార్యభర్తలు తమ యాక్టివా స్కూటీపై పని నిమిత్తం గచ్చిబౌలి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనకనుంచి అతి వేగంగా వస్తున్న కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన దంపతులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతులను దంపతులు దుర్గం రాజు, మౌనికగా పోలీసులు గుర్తించారు. మౌనిక నార్సింగి మున్సిపాలిటీలో పనిచేస్తోంది. అలాగే నిందితుడిని సంజీవ్‌గా గుర్తించిన పోలీసులు మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిందని తెలిపారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 108 చూపించింది. దీంతో సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా,