రోబో 2.0 రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

robo-2.0-movie-review

నటీ నటులు : రజిని కాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్
రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎన్.శంకర్

rajanikanth-movies

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం చిట్టి అనే ‘రోబో’ను దర్శకుడు శంకర్ మనకు పరిచయం చేశారు. మనిషిలా ఉండే ఈ రోబోతో కామెడీ చేయించి అదే రోబోకి ప్రేమ పుట్టేలా చేసి మానని ఏడిపించి నవ్వించి చివరికి ఆలోచింపచేసి ఇంటికి పంపారు. అద్భుతమైన విజువల్స్, కళ్లు చెదరగొట్టే విఎఫ్ఎక్స్, రెహమాన్ సంగీతం, రజినీకాంత్ నటన, ఐశ్యర్యరాయ్ అందం.. ఇలా ‘రోబో’లో ప్రతి అంశం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. అయితే, చిట్టి వల్ల సమాజానికి మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆ రోబోను శంకర్ డిస్‌మాంటిల్ చేశారు. మళ్లీ ఎనిమిదేళ్ల తరవాత ఆ చిట్టిని రీలోడ్ చేసి మంచికి వాడే ప్రయత్నం చేశారు. వర్షన్ ‘2.0’ను రూపొందించి మరోసారి మాయచేయడానికి సిద్ధమయ్యారు.

rajani-kanth-robo-2.0-movie

సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ 2.O. సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్ ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఈ సినిమాకోసం శంకర్, రజనీ, అక్షయ్ ఎంత కష్టపడ్డారో మనం మేకింగ్ వీడియోస్ లలోనే చూసాం. మరి వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందా..? అసలు చిట్టి రీలోడెడ్‌ ఎందుకు అవ్వాల్సి వచ్చింది..? అనేది రివ్యూలో చూద్దాం.

కధ :

robo-2.0

”వినువీధిలో విహరించే విహంగంలారా అంటూ మొదలయ్యే ఈ సినిమాలో డైరెక్టర్ కార్డ్ పడక ముందే ఒక వ్రుద్హుడు ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఎందుకో ఏమిటో టియదు. అది జరిగిన మరుసటి నాటి నుండి చెన్నై నగరంలో ఉన్నట్టుండి అందరి చేతుల్లో నుండి సెల్ ఫోన్స్ ఆకాశంలోకి వెళ్తుంటాయి..ఎంత గట్టిగా పట్టుకున్న సరే బలవంతంగా ఎవరో లాగినట్లు మాయ‌మైపోతుంటాయి. ఈ పరిణామం చూసి అంత షాక్ అవుతుంటారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో ఓ పెద్ద పక్షి (అక్షయ్ కుమార్) నగరంలోకి చొరబడి అన్ని నాశనం చేస్తుంటుంది. ఎలాగైనా ఆ పక్షిని అడ్డుకోవాలని ప్రభుత్వం మేధావులతో సమాలోచనలు చేసి వశీకర్ సృష్టించిన చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దించడానికి నిర్ణయం తీసుకుంటారు. మరి చిట్టి ఆ పక్షిని ఎలా అడ్డుకుంటాడు..? అసలు పక్షిరాజుకు జనాల మీద ఎందుకు ఎందుకు దాడి చేస్తుంది..? అసలు పక్షి మనిషి ఎవరు..? తదితర విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

2.o-movie-sankarశంకర్ తన ప్రతి సినిమాను సామాజిక నేపధ్య కథ ఉండేలా చూసుకుంటాడు. ఈ సినిమాలో కూడా సెల్ ఫోన్స్ వల్ల ఎలాంటి హాని జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేసాడు. ఆయన ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నాడో తెరపై అంతే విధంగా చూపించాడు. కానీ ఈ క్రమంలో భారతీయ సినిమాని తన విజుయల్స్ తో ఎక్కడో నిలబెట్టిన శంకర్ మళ్ళీ వెనక్కి వచ్చి పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసి చూపే ప్రయత్నం చేసాడనిపించింది. ఎనిమిదేళ్ళ క్రితం ఎన్నుకున్న సబ్జెక్ట్ ని, దాని వలన వచ్చిన క్రేజ్ నీ క్యాష్ చేసుకునే ప్రయత్నమే అనిపించింది. ఆ విషయాన్ని పక్కన పెడితే సినిమా పరంగా చాలా బాగుంది. సినిమాలో ప్రదానంగా రజనీకాంత్ – అక్షయ్ కుమార్ ల నటన గురించి చెప్పుకోవాలి.

robo-movie

ఈ వయసులో కూడా రజనీ ఈ రేంజ్ లో నటించడం, డాన్సులు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో సైంటిస్ట్‌ పాత్రలో వశీకరణ్‌గా, చిట్టి, 2.ఓ, మినీరోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది.అక్షయ్ కుమార్ చెలరేగి నటించాడు. పోటాపోటీగా ఉంది ఇద్దరి నటన. ఇక లేడీ రోబో వెన్నెలగా నటించిన అమీ జాక్సన్ తన పరిధి మేర నటించింది, కాదుకాదు నవ్వించింది. తమిళ మూలం నుండి తెలుగు అనువాదం చేసిన వారు శ్రీ రామకృష్ణ, ఆయన మాటలు చాలా బాగున్నాయి. ఇక మిగతా నటి నటులంతా తమిళ్ వారే కావడం, వలన పెద్దగా గుర్తుండే అవకాసం లేదు.

robo-rajinikanth-moviesసినిమాకు ప్రధాన ఆకర్షణ సినిమాకు పనిచేసిన సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్) వారు, డీఐ, వీఎఫ్ఎక్స్ వారు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మ‌న తెలుగు ప్రేక్ష‌కుల్ని కొత్త అనుభూతిలోకి తీసుకెళ్లారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్‌ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఆంటోని ఎడిటింగ్‌ బాగుంది. ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : ‘2.0’ కొత్త జాడీలో పాత పచ్చడి
తెలుగు బులెట్ రేటింగ్ : 2.75 / 5