సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న రోబో 2.0 సినిమా ఈ నెల అనగా నవంబర్ 29 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రజినీకాంత్ మరియు అక్షయ్ కుమార్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి ఎత్తింది. వశీకర్ మరియు చిట్టి అనే పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ రోబో 2.0 సినిమాని డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా 550 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా 2010 లో విడుదలైన రోబో సినిమాకి సీక్వెల్. రోబో సినిమాలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించగా, సీక్వెల్ లో మాత్రం తను అతిధి పాత్ర మాత్రమే పోషిస్తున్నట్లు సమాచారం.
రోబో 2.0 లో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ పాత్ర కూడా చిట్టి పాత్ర లాగే రోబో అని, అమీ జాక్సన్ చిట్టి కి జతగా నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటివరకైతే అమీ జాక్సన్ లుక్ ని అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, ఈరోజు విడుదలైన రోబో 2.0 సినిమా పోస్టర్ లో మాత్రం అమీ జాక్సన్ రోబో లుక్ ని రివీల్ చేశారు. మనిషి రూపం లో ఉండే రోబో గా అమీ జాక్సన్ లుక్ ఆసక్తి రేకెత్తిస్తుండగా, ఈ సినిమాలో అమీ జాక్సన్ కూడా చిట్టి రోబో లాగానే విన్యాసాలు చేస్తుందని ఊహించొచ్చు. ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బం నుండి ఇప్పటివరకు విడుదలైన పాటలు రోబో సినిమా లాగా అయితే లేవని మ్యూజిక్ లవర్స్ పెదవి విరుస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తో అమీ జాక్సన్ కి ఇది రెండో సినిమా. ఇప్పటికే అమీ జాక్సన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఐ సినిమాలో నటించింది. కానీ, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేకపోయినా, హీరోయిన్ గా అమీ జాక్సన్ కి మంచి మార్కులు పడేసరికి డైరెక్టర్ శంకర్ మల్లి తనకి అవకాశం ఇచ్చి, ఈ ప్రెస్టీజియస్ మూవీ లో రోబో పాత్ర లో నటింపచేసారు.