‘3.ఓ’ మూవీ కూడా చేస్తాడట…!

Shocking Price For Robo 2.0 Movie Ticket

సౌత్‌ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత శంకర్‌ది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అద్బుతమైన టేకింగ్‌తో విజువల్‌ వండర్స్‌గా సినిమాను తెరకెక్కించడంలో శంకర్‌ హాలీవుడ్‌ దర్శకులకు ఏమాత్రం తీసిపోడు. కొన్ని సంవత్సరాల క్రితం ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించి అబ్బురపర్చిన శంకర్‌ తాజాగా 2.ఓ అనే చిత్రాన్ని తెరకెక్కించి అద్బుతమైన విజువల్‌ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ నెల చివర్లో 2.ఓ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్‌కు అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది. ఇక ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో అతిరథ మహారథులు పాల్గొన్నారు. ప్రముఖ స్టార్స్‌ సమక్షంలో జరిగిన ఈ ట్రైలర్‌ ఆవిష్కర కార్యక్రమంలో శంకర్‌ మరో ఆసక్తికర ప్రకటన చేశాడు.

Rajinikanth Robo 2.0 Movie Budget

శంకర్‌ త్వరలో కమల్‌ హాసన్‌తో కలిసి ‘భారతీయుడు 2’ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వచ్చే నెలలో సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు రోబో సీక్వెల్‌ లో భాగంగా ‘3.ఓ’ చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించాడు. 2.ఓ చిత్రానికి దాదాపు మూడు సంవత్సరాలు తీసుకున్న శంకర్‌ 3.ఓ చిత్రానికి కనీసం అయిదు సంవత్సరాలైన తీసుకుంటాడేమో అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. రోబో సినిమాను విజువల్‌ వండర్‌గా రూపొందించిన శంకర్‌ తాజాగా 2.ఓ చిత్రాన్ని అద్బుతమైన విజువల్స్‌తో తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ఈనెల చివర్లో విడుదల చేయబోతున్నారు. రజినీకాంత్‌ హీరోగా అక్షయ్‌ కుమార్‌ విన్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా కనిపించబోతుంది.

Kamal Haasan And Shankar Join Hands For Bharateeyudu Sequel