బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. బీ టౌన్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్.. హిందీ సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ ఫేమస్ కరణ్ జోహర్.. ఈ ముగ్గురు కలిస్తే ఇంకేముంది ఓ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ సినిమా పక్కా. తాజాగా రిలీజ్ అయిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమా టీజర్ చూస్తుంటే అది నిజమే అని అనిపించక మానదు.
ఏడేళ్ల తర్వాత కరణ్ జోహర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఒక్క డైలాగ్ లేకుండా టీజర్ మొత్తం మ్యూజిక్‌తోనే నింపేశారు.కరణ్ తన స్టైల్ ఆఫ్ కామెడీని, ఎమోషన్స్‌ను పుష్కలంగా దట్టించినట్లు టీజర్ చూస్తే తెలిసిపోతోంది. లవ్ , ఎమోషన్ , సంఘర్షణ వంటి మూడు బావల కలయికతో ఈ సినిమా రూపొందింది. కుటుంబ కథా చిత్రం గ ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ధర్మేంద్రా, జయా బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.