‘రోహిత్ శర్మ 70 శాతం ఫిట్‌నెస్‌తో మాత్రమే ఉన్నాడు’…ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్య ఇది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపిౖMðన రోహిత్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల తర్వాత రోహిత్ శర్మ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లోకి అడుగు పెట్టాడు. గాయాలపాలైన భారత క్రికెటర్లకు ఇది పునరావాస కేంద్రం. బోర్డు వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంతో పాటు ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్ కూడా ఇక్కడే నిరూపించుకోవాల్సి ఉంటుంది.
పేసర్ ఇషాంత్ శర్మ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. రోహిత్ ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చాడా.. నిజంగా కండరాల గాయంతో బాధపడుతూ కోలుకునేందుకు వచ్చాడా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే రోహిత్ పూర్తి ఫిట్‌గా లేడనేది మాత్రం వాస్తవం. అతను బోర్డు హెచ్చరికను ఖాతరు చేయకుండా అదే గాయంతో ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు. చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి పర్యవేక్షణలో రోహిత్ ఎన్‌సీఏలో తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.