చుడీదార్ వేసుకుంటే మగాడా ?

Roja Controversy Comments On Bhuma Akhila Priya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజాకి మరోసారి పూనకం వచ్చింది. నంద్యాల ఉపఎన్నికలో గెలుపు కోసం ఏమైనా చేస్తాం, ఏదైనా మాట్లాడతాం, ఎంతకైనా తెగిస్తాం అన్న రీతిలో సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ నోరుతెరిచి సీఎం చంద్రబాబుని కాల్చేసినా తప్పు లేదని అంటే… రోజమ్మ ఇంకో అడుగు ముందుకెళ్లారు. నంద్యాల లో ఓటర్ల మీద సెంటి మెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న భూమా అఖిలప్రియ ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. తల్లిని కోల్పోతే ఎమ్మెల్యే, తండ్రిని కోల్పోయి మంత్రి పదవి తేలిగ్గా దొరగ్గానే ఆమెకి కొమ్ములు వచ్చాయా అని రోజా నిలదీశారు. ఏదో రాజకీయ విమర్శలు చేస్తున్నారులే అనుకుంటే రోజా గతి తప్పి, మతి పోయినట్టు మాట్లాడారు.

సంస్కారం,సంప్రదాయం గురించి అఖిలప్రియకు మాట్లాడే హక్కు లేదన్న రోజా ఆమె దుస్తుల గురించి సభ్యత లేకుండా నోరు జారారు. బొట్టు, చీర కట్టు లేకుండా మగాడిలా చుడీదార్ వేసుకున్నావని అఖిల ప్రియ మీద రోజా విరుచుకు పడ్డారు. అయినా సినిమాల్లో మీరు ఏ రకంగా దుస్తులు వేసుకున్నారు, ఏ డైలాగ్స్ చెప్పారు అన్న ప్రశ్న ఎవరూ అడగలేదంట అది వారి సంస్కారం. తోటి మహిళ కట్టుబొట్టు గురించి మాట్లాడి మరోసారి తన నోటికి హద్దూపద్దూ లేదని రోజా మరోసారి నిరూపించుకున్నారు. మొత్తానికి వైసీపీ అభ్యర్థి తమ్ముడు తమని గెలిపించకపోతే మగాళ్లు కాదు ఆడోళ్ళు అంటూ మహిళజాతిని కించపరిస్తే ఇప్పుడు రోజమ్మ వచ్చి చుడీదార్ వేసుకుంటావా మగోడిలా అంటూ స్త్రీ జాతి మీద తమకున్న చిన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. ఏమైనా వీరి మాటలు చూస్తుంటే నంద్యాలలో టీడీపీ గెలుపుకి వైసీపీ ప్రచారమే బాగా పనిచేసేలా వుంది.

మరిన్ని వార్తలు:

టీవీ ఛానల్స్ కి పెద్ద నోట్ల రద్దు దెబ్బ…

మోదుగుల అటు…అయోధ్య ఇటు ?

పూనం అంటే మీడియాకు భయమా..?