మంచు ఫిక్స్‌ అయ్యాడు

Manchu Manoj Okkadu Migiladu Movie Release On Sep 8

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే నెలలో 8వ తారీకున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమాకు సంబంధించిన నిర్మాణానంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ ఎల్టీటీఈ నేతగా కనిపించబోతున్నాడు. యుద్ద సన్నివేశాలు మరియు పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సీన్స్‌ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లుగా పోస్టర్స్‌ చూస్తుంటే అనిపిస్తుంది. చాలా కాలంగా సరైన సక్సెస్‌ లేక కొట్టుమిట్టాడుతున్న మంచు మనోజ్‌కు ఈ సినిమా సక్సెస్‌ చాలా అవసరం.

ఈ చిత్రంలో మంచు మనోజ్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఎలా ఉన్నా మనోజ్‌కు మంచి మార్కులు తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో మనోజ్‌ అద్బుతమైన నటనను కనబర్చారు. తప్పకుండా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ చెప్పుకొచ్చాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై సినీ వర్గాల్లో కూడా ఆసక్తి ఉంది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి నేపథ్యంతో సినిమా రాలేదు. ఆ కారణంగానే ఈ సినిమా తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. చూద్దాం మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో..!

మరిన్ని వార్తలు:

దిలీప్ కు దెబ్బ మీద దెబ్బ

సమ్మె ముగిసింది.. మళ్లీ షూటింగ్స్‌ షురూ

బిగ్‌బాస్‌ను వదలని కష్టాలు