దిలీప్ కు దెబ్బ మీద దెబ్బ

Actor Dileep's multiplex to be closed down

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మలయాళ స్టార్ దిలీప్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నటి భావన కిడ్నాప్ కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్న ఈ నటుడి ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు ఆయన పేరుతో ఉన్న మల్టీప్లెక్స్ కూడా మూత పడుతోంది.

మల్టీప్లెక్స్ కు, భావన కేసుకు సంబంధం లేదు. కానీ కాలం కలిసిరాకపోతే ఏపని చేసినా వర్కవుట్ కాదని దిలీప్ ను చూస్తుంటే తెలుస్తోంది. మల్టీప్లెక్స్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. అటు పోలీసులు కూడా మున్సిపాలిటీ ఆదేశాలు పాటించాలని వార్నింగ్ ఇచ్చారట.
ఏరి కోరి ప్రేమించి హీరోయిన్ కావ్య మాధవన్ ను మూడో పెళ్లి చేసుకున్న దిలీప్.. ఇప్పుడు అన్నీ పోగొట్టుకుంటున్నారు. అంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న మంజు వారియర్ కు చేసిన ద్రోహమే ఆయన్ను వెంటాడుతోందని ప్రత్యర్థులు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

ఐటీలో ఈ ఉద్యోగాలు ఇక హుష్ కాకి.

జగన్ కి వంతపాడే ఐఏఎస్ కి లోకేష్ పెద్ద పీట?

ప్రకాశం టీడీపీ లో రాంబాంబు పేలింది.