సమైక్య బాటలో తెలంగాణ పోలీసులు

CM KCR praises Telangana police officers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రతి విషయంలోనూ సమైక్య పాలకుల్ని తిట్టే కేసీఆర్ పోలీసింగ్ విషయంలో వారిని తుచ తప్పకుండా అనుసరిస్తున్నారు. వారేం చేసినా ఈ విషయంలో కరెక్ట్ చేశారని డైరక్టుగానే చెప్పేస్తున్నారు కేసీఆర్. సీఎం అయిన కొత్తలో కూడా పోలీసింగ్ ను మెచ్చుకున్న కేసీఆర్.. ఆ క్రెడిట్ మాజీ సీఎంలకు కాకుండా పోలీసులకే ఇచ్చారు.

ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అదే మాట అంటున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు విధించినన్ని ఆంక్షలు అప్పుడు లేవని చెబుతున్నారు. జానారెడ్డి లాంటి నేతలైతే కేసీఆర్ పాలన కంటే సమైక్య పాలన చాలా బెటర్ అంటున్నారు. అవును కేసీఆర్ ఆ లెవల్లో పోలీసింగ్ చేస్తున్నారు మరి.

కరీంనగర్లో మెడికల్ కాలేజ్ కోసం మాజీ ఎంపీ పొన్నం దీక్షకు దిగితే.. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కేసీఆర్ దీక్ష చేసేటప్పుడు చేసుంటే తెలంగాణ వచ్చేది కాదని ఏపీ జనం అనుకుంటున్నారు. నిజంగా కేసీఆర్ రాష్ట్రం వచ్చిందాకా ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాటగా పాలన సాగిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు:

దిలీప్ కు దెబ్బ మీద దెబ్బ

ఆవు చేలో మేస్తే జగన్… మంత్రి నక్కా కామెంట్స్

జగన్ పై టీడీపీ ఎదురుదాడి