‘నేనే రాజు నేనే మంత్రి’కి అదిరిన బిజినెస్‌

nene raju nene mantri good business for film industry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రానా, కాజల్‌ జంటగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ‘బాహుబలి’ కాకుండా రానా కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. దాంతో సినిమాకు మంచి బిజినెస్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాను  డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 

నిర్మాత సురేష్‌బాబుకు విడుదలకు ముందే లాభాలు వచ్చినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రానా కెరీర్‌లో ‘బాహుబలి’ కాకుండా ఇంత భారీ బిజినెస్‌ చేయడం ఇదే ప్రథమం. ఈ చిత్రంతో రానా కమర్షియల్‌ హీరోగా, స్టార్‌ ఇమేజ్‌ను దక్కించుకోవడం ఖాయం అని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ‘లీడర్‌’ చిత్రం తర్వాత రానా నటించిన ఈ పొలిటికల్‌ చిత్రంపై సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తి కారణంగా బిజినెస్‌ బాగా జరిగిందని సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు అంటున్నారు. అన్ని ఏరియాల్లో కూడా సినిమాకు మంచి టాక్‌ రావడం ఖాయం అని, సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లను రాబడుతుందని నిర్మాత సురేష్‌బాబు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

సమ్మె ముగిసింది.. మళ్లీ షూటింగ్స్‌ షురూ

బిగ్‌బాస్‌ను వదలని కష్టాలు