వంశీ పరువు తీసిన వర్మ

RGV Shocking Comments On Krishna Vamsi Nakshatram Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ గోపాల్‌ వర్మ తనకు ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాడు, తన వారి గురించి కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. సహజంగా ఇతర దర్శకులు తమ సినిమాలు కాకుండా ఇతరుల సినిమాలు చూసేందుకు ఆసక్తిని కనబర్చరు. కాని వర్మ మాత్రం వచ్చిన ప్రతి సినిమాను చూస్తూ తన అభిప్రాయంను వ్యక్తం చేస్తూ ఉంటాడు. తాజాగా నక్షత్రం సినిమాను చూసిన వర్మ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయని, ప్రేక్షకులు కూడా చుక్కలు చూస్తున్నారని వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. వంశీ కూడా తన దారిలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది అంటూ చమత్కరించాడు.

ఇప్పటికే సినిమా ఫ్లాప్‌ అయ్యి నిర్మాతలు తలపట్టుకుంటే వర్మ చేసిన వ్యాఖ్యలు సినిమాకు మరింత డ్యామేజీ చేసే విధంగా ఉంది. సినిమాకు ప్రేక్షకుల నుండి నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికి అంతో ఇంతో కలెక్షన్స్‌ వస్తాయని నిర్మాతలు భావించారు. కాని వర్మ రివ్యూతో సినిమాకు మొత్తంగా గండి పడే అవకాశాలు ఉన్నాయి. మొదటి మూడు రోజుల్లో అయినా అంతో ఇంతో వసూళ్లు వస్తాయని అంతా భావించారు. కృష్ణవంశీ గతంలో వర్మ వద్ద శిష్యరికం చేసిన విషయం తెల్సిందే. ఆ చనువుతోనే వంశీ కూడా నా దారిలోకి వచ్చాడు అంటూ వర్మ కామెంట్స్‌ చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు:

దిలీప్ కు దెబ్బ మీద దెబ్బ

సమ్మె ముగిసింది.. మళ్లీ షూటింగ్స్‌ షురూ

బిగ్‌బాస్‌ను వదలని కష్టాలు