పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటర్లు గుప్పించారు. సొంతంగా పార్టీ పెట్టి పక్క పార్టీ వాళ్లకు ఓట్లేయమని చెప్పే ఏకైక నాయకుడు పవన్‌ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో జనసేన పార్టీకి ఉనికి లేదని బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికలలో పోటీకి సిద్దమై చివరకు బీజేపీకి ఓటేయండని చెప్పి పవన్‌ ఎన్నికల నుంచి తప్పుకున్నాడని అన్నారు.

అయితే బీజేపీ, జనసేనలు కలిసి పనిచేసినా తిరుపతి ఉపఎన్నికలో గెలుపు అసంభవమని, ఏపీలో ఎన్నికలు ఏవైనా గెలిచేది మాత్రం వైసీపీనే అని రోజా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తొలుత గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయాలని భావించిన జనసేన తమ అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసుకుంది. అయితే చివరి క్షణాల్లో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను కలిసి బీజేపీకి మద్దతు తెలపాల్సిందిగా కోరడంతో జనసేన పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.