ఆర్ఆర్ఆర్ అంటే… రౌద్రం.. రణం.. రుధిరం రిలీజ్…

తెలుగువారి అందరికీ.. ఉగాది పర్వదినం ఎంతో స్పెషల్. ఈ పండుగల సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను ఆ సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్‌ హీరోలు రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. పలు భాషల్లో ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను విడుదల చేశారు. కాగా ఈ సినిమాకు ‘రౌద్రం.. రణం.. రుధిరం’ అని పేరు పెట్టడంతో అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.
కాగా ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తుండ‌గా బాలీవుడ్ తార‌లు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ తో పాటు.. హాలీవుడ్ తార‌లు ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడీ న‌టిస్తున్న విషయం తెలిసిందే.