ప్రస్తుతానికి దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR. కాగా ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, మెగా పవర్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు… ఇకపోతే ఈ చిత్రం తరువాత రాజమౌళి ఏ హీరో తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడనే విషయం కాస్త చర్చనీయాంశంగా మారిందని సమాచారం.
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ RRR చిత్రం తరువాత, దర్శక ధీరుడు రాజమౌళి చిన్న హీరోతో, ఒక చిన్న సినిమాను తీయనున్నాడని సమాచారం. అందుకు గాను ఇప్పటి నుండే కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారంట రాజమౌలి తండ్రి విజయేంద్రప్రసాద్… అయితే ఇప్పటికే వరుసగా పెద్ద చిత్రాలు తీసి బాగా స్ట్రెస్ అయిన దర్శకుడు, ఒక చిన్న సినిమా తీసి కాస్త రిలాక్స్ అవ్వాలని భావిస్తున్నారంట… ఇకపోతే RRR తరువాత మహేష్ బాబు తో రాజమౌళి ఒక సినిమా చేస్తాడని గత కొద్దీ రోజులుగా సామాజిక మాంద్యమాల్లో వార్తలు బాగా వస్తున్నాయి. కానీ రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మహేష్ బాబు అభిమానులు అందరు కూడా షాక్ లో ఉన్నారని సమాచారం. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది…