జక్కన సినిమాలో సోనాక్షి…భట్…!

RRR Rajamouli To Cast Alia Bhatt With Ram Charan And Junior NTR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కథానాయకులుగా ఒక మల్టీస్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో జరుపుకుంటోంది. మూడవ షెడ్యూల్ నుంచి కథానాయికల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉండగా ఆయా కధానాయికలు ఎవరనే దాని మీద ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళి కథానాయికల ఎంపిక ప్రక్రియపై దృష్టిపెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాకి ముగ్గురు కథానాయికలు అవసరం కావడంతో, ఒక కథానాయికగా పరిణితీ చోప్రాను తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఆమె మార్కెటింగ్ టీం చేసిన స్ట్రాటజీ అని తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా కధానాయికల పాత్రల కోసం సోనాక్షి సిన్హా తోను అలియా భట్ తోను సంప్రదింపులు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే కథానాయికల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.