అక్కడ డిన్నర్ అంటే పడక గదిలోకే అంట…!

Sherlyn Chopra About Real Meaning Of Dinner In Bollywood

బాలీవుడ్ లో డిన్నర్ అనే పదానికి అర్థమేంటో నటి షెర్లిన్ చోప్రా వివరించింది. బాలీవుడ్ లో హీరోయిన్ లను డిన్నర్ కు పిలిచారంటే పడక సుఖం అందించమని కోరడానికే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది షెర్లిన్ చోప్రా. చీటికీ మాటికీ ఒంటి మీద ఉన్న బట్టలను తీసి పడేస్తూ అందాల ఆరబోతకు సిద్ధమయ్యే షెర్లిన్ చోప్రాకో ఎంత విప్పినా ఆ స్థాయి ఛాన్స్ లు మాత్రం రాలేదు, రావడం లేదు.

అదేమన్నా మనసులో పెట్టుకుందో ఏమో తాజాగా బాలీవుడ్ మీడియా ముందుకు వచ్చిన ఈ భామ బాలీవుడ్ లో పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు రాత్రి కి డిన్నర్ చేద్దాం అని ఆహ్వానిస్తే అది ముమ్మాటికీ పడక సుఖం అందించడానికి మాత్రమే. ఎందుకంటే నన్ను చాలామంది డిన్నర్ కు పిలిచారు, మొదట్లో అనుమానం వచ్చేది. ఆ తర్వాత పూర్తిగా అర్థమైంది. దీంతో అప్పటి నుంచి ప్రతిభ కలిగిన దర్శకులు, నిర్మాతలనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నా. చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన వారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతాయి’ అని షెర్లిన్ తెలిపింది.