రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రంకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రాజమౌళి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం మల్టీస్టారర్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. తన టీంతో కలిసి ఫాం హౌస్‌లో ఆర్ మల్టీస్టారర్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్ శివారులోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్‌ను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం దానయ్య ఒక ఆఫీస్‌ను నిర్మించాడు. దాని ఖరీదు రెండు కోట్లు అంటూ ఫిల్మ్ నగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఏ సినిమాను చేసినా కూడా దానికోసం ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు అవుతుంది. ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన ఆఫీస్‌తో సంబంధం లేకుండా సినిమా ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. జక్కన్న తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్ మూవీ కోసం ఒక భారీ ఆఫీస్‌ను తీసుకున్నారు. సినిమా ఆఫీస్‌కు సంబంధించి హెడ్ దర్శకుడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జక్కన్న కోసం ఈ ఆఫీస్‌ను చాలా రిచ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో రెండు కోట్లతో తీసుకున్నాడు. సహజంగా అయితే సినిమా కోసం ఆఫీస్‌ను రెంట్‌కు తీసుకోవడం లేదా కొన్నాళ్ల పాటు లీజ్‌కు తీసుకోవడం చేస్తూ ఉంటారు. జక్కన్న మల్టీస్టారర్ కోసం కూడా నిర్మాత దానయ్య అదే పని చేశాడు. ఖరీదైన ఏరియాలో అత్యంత విలాసవంతమైన పెద్ద భవనంను రెండున్నర సంవత్సరాలకు గాను దానయ్య లీజ్‌కు తీసుకున్నాడు. లీజ్ మరియు భవనంలో చేయించిన మార్పులు చేర్పులకు కలిపి దాదాపు రెండు కోట్లు అయినట్లుగా సమాచారం అందుతుంది.