చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బస్సు నడుపుతుండగా ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అతను సీటులోనే నొప్పితో బాధపడడం చూసిన ఓ ప్రయాణికుడు వెంటనే స్టీరింగ్‌ను కంట్రోల్ చేశాడు. కాసేపటికే డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. వివరాలు ఇలా..చిత్తూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది.
మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు వచ్చి సీటులోనే మృతి చెందాడు. అప్రమత్తమైన ఓ ప్రయాణికుడు స్టీరింగ్‌ను కంట్రోల్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని శ్రీకాళహస్తికి చెందిన బి.రవిగా పోలీసులు గుర్తించారు.