ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ.. రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా.. 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రష్యాను సస్పెండ్ చేయడంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేయగా.. క్రెమ్లిన్ మాత్రం సీరియస్ కామెంట్స్ చేసింది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది.
ఇదిలా ఉండగా.. యుద్ధం వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులపై రష్యా నిషేధం విధించింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్‌లు తమ దేశంలో ప్రవేశించడానికి వేళ్లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆంక్షలు విధించిందిన విషయం తెలిసిందే.
దానికి కౌంటర్ ఇస్తూ రష్యా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది.ఆ రెండు దేశాల ప్రధానులతో పాటుగానే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది, న్యూజిలాండ్‌కు చెందని 130 మందితో కూడిన నిషేధితుల జాబితాను విడుదల చేసింది. కాగా, తర్వలోనే ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్తలు, నిపుణులు, మిలిటరీని కూడా బ్లాక్ లిస్టులో చేరుస్తామని రష్యా హెచ్చరించింది.