భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికెత్తారు. నిజమైన దేశభక్తుడంటూ జైశంకర్‌ను అభివర్ణించారాయన. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా భారత్ సొంత విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోందని.. చాకచక్యంగా దౌత్యం నడిపించడంలో జైశంకర్ ముందుంటున్నారంటూ పేర్కొన్నారు సెర్గీ లావ్రోవ్.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు, కొన్ని సవాళ్లు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగింది. ఈ వ్యవహారంలో భారత విదేశాంగ వ్వవహారాల మంత్రి జైశంకర్ వ్యవహరించిన తీరు హర్షణీయం.
అందుకే ఆయన అతని దేశానికి నిజమైన దేశభక్తుడు అంటూ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికి ఎత్తాడు.జైశంకర్ అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, నిజమైన దేశభక్తుడు. దేశ భద్రత కోసం, అభివృద్ధికి అవసరమని భారత్ ఏదైతే విశ్వసిస్తుందో.. మేం కూడా ఆ మార్గంలోనే వెళ్లాలనుకుంటున్నాం. పైగా చాలా దేశాలు భారత్‌లా వ్యవహరించలేవు కూడా అని పేర్కొన్నారు.
రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్ కొనసాగించిన లావాదేవీలపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ బదులు ఇచ్చారు. ముందు ఈయూ సంగతి చూడాలని, వాళ్లతో పోలిస్తే తాము చేసుకుంటున్న దిగుమతుల మోతాదు చాలా తక్కువేనని, పైగా మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ అమెరికా లేవనెత్తిన అభ్యంతరాలకు గట్టి కౌంటరే ఇచ్చారాయన. ఈ నేపథ్యంలో.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.