హిందీలోకి ఆరెక్స్ 100…ఇందు ఎవరో ?

ఏడాది క్రితం తెలుగులో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో ‘ఆర్ ఎక్స్ 100’ ఒకటి. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ నటించిన ఈ సినిమా, యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. భారీ వసూళ్లతో విజయ విహారం చేసింది. దాంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సీనియర్ హీరో సునీల్ శెట్టి వారసుడు ‘అహన్ శెట్టి’ ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. మిలన్ లుథ్రియా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగు మొదలు కానుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ‘స్టీఫెన్ రిచ్చర్’ను ఈ సినిమా కోసం రంగంలోకి దింపారు. గతంలో ఈయన సల్మాన్ ‘కిక్’ సినిమాకి పనిచేసిన సంగతి తెలిసిందే.