ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్, ప్రస్తుత నెదర్లాండ్స్ హెడ్ కోచ్ ర్యాన్ క్యాంప్‌బెల్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ర్యాన్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ర్యాన్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
దిగ్గజ వికట్కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సమకాలికుడైన ర్యాన్ క్యాంప్‌బెల్ 2002 సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డేలు ఆడాడు. ఆస్ట్రేలియా జట్టులో గిల్‌క్రిస్ట్ పాతుకుపోవడంతో ర్యాన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో అతను హాంగ్‌కాంగ్ జట్టుకు వలన వెళ్లాడు. హాంగ్‌కాంగ్ జట్టు తరఫున మూడు టీ20లు ఆడాడు. అనంతరం 2017లో నెదర్లాండ్స్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు.