సాహో ఫస్ట్ సాంగ్ ‘సైకో సయాన్’ పూర్తి వీడియో వచ్చేసింది

saaho first song psycho saiyaan full video

ప్ర‌భాస్, సుజీత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ సాహో. ఏకంగా 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటని ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇప్పటికే సైకో సయాన్ అనే సాంగ్ టీజర్‌ను టీం విడుదల చేసింది. ఆ సాంగ్ టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఆ సాంగ్ పూర్తి వీడియోను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కేక. ప్రభాస్, శ్రద్ధ లుక్స్ కూడా సూపర్బ్. ఈ పాటతో వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరిందని తెలుస్తోంది.

సాహో చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, మేకింగ్ వీడియోల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న మేకింగ్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ది. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా సాహో సినిమా విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.