ఎక్కువ మంది వీక్షించిన వీడియోగా సాహో సాంగ్

saaho song as the most viewed video

బాహుబలి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం సాహో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ సాహోపై మొద‌టి నుండి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఏకంగా 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంది . ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, మేకింగ్ వీడియోల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్‌గా సైకో సయాన్ అనే సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల‌ చేసింది చిత్ర బృందం. ఆ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కేక పెట్టించ‌గా, ప్రభాస్, శ్రద్ధ లుక్స్ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోని 11,473,089 మంది వీక్షించారు. ఈ సాంగ్ అరుదైన రికార్డ్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన వీడియోగా సైకో సయాన్ నిలిచింది. త‌నిష్క్ బ‌గ్చీ ఈ పాట‌కి సంగీతాన్ని అందించ‌గా.. సాచెట్ తండ‌న్‌, ధావ‌ని బ‌నుషాలి, త‌నిష్క్ బ‌గ్చీ ఆలపించారు. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా సాహో సినిమా విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.