25 నెల‌ల సాహో

saaho shoot wrap up

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఒకప్పుడు ఏడాదికి ఒక చిత్రంతో అయిన ప‌ల‌క‌రించే వాడు. కాని బాహుబ‌లికి ఆయ‌న‌ కేటాయించిన స‌మ‌యం మూడేళ్ళ‌కి పైమాటే. ఆ చిత్ర ఫ‌లితంతో ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో చిత్రం చేస్తున్నాడు ప్ర‌భాస్ . హై బ‌డ్జెట్‌తో పాటు భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 9, 2017న సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్ర షూటింగ్ జూలై 15, 2019న ముగిసింది. అంటే దాదాపు 25 నెల‌లు సాహో కోసం ప‌ని చేశాడు ప్ర‌భాస్. సాహో చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో సెట్‌లో ప్ర‌భాస్ కేక్ క‌ట్ చేశారు. టీం మెంబ‌ర్స్ అంద‌రికి కేక్ తినిపించారు. వారితో క‌లిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో డ‌బ్బింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వ‌ర్క్, సీజీ వ‌ర్క్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. రీసెంట్‌గా చిత్రానికి సంబంధించి సైకో సయాన్ అనే సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.