సాహో విడుదల వాయిదా..అదే రోజు శర్వా ‘రణరంగం’

Saaho release date postponed

ప్రభాస్‌, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ‘సాహో’ సినిమాను చిత్రయూనిట్ 30వ తేదీకి వాయిదా వేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం అవసరముండటంతో సాహోను ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించినట్లు టాక్. సాహో చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్, నీల్ నితిన్ ముఖేశ్, జాకీష్రాప్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మరోవైపు శర్వానంద్, సుధీర్ శర్మ కాంబినేషన్ లో వస్తోన్న రణరంగం చిత్రం ఆగస్టు 2న విడుదల కావాల్సి ఉండగా..ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నారు.