‘ఎవరు’ విడుదల తేదీ ఖరారు

evaru movie release date confirmed

అడివిశేష్‌, రెజీనా కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఆగస్ట్‌ 15న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ “క్షణం’ విజయం అనంతరం అడివిశేష్‌తో మా సంస్థ రూపొందిస్తున్న చిత్రమిది. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఓ పోలీస్‌ ఎవరి కోసం అన్వేషణ సాగిస్తున్నాడన్నది ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల. పీవీపీ సినిమా పతాకంపై పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మిస్తున్నారు. వెంకట్‌ రామెజీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవీన్‌చంద్ర కీలక పాత్రధారి.