గుడ్డు విషయంలో అనేక మందికి అపోహలు

గుడ్డు విషయంలో అనేక మందికి అపోహలు

గుడ్డులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కొంతమంది తమను తమూ ఎగ్ టేరియన్స్‌గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందువల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగ్‌టేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు.

ఎగ్ వైట్‌లో పుష్కలమైన అల్బుమిన్ ఉంది. ఇది ప్రోటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.గుడ్డులోని పచ్చసొన కాకుండా ఎగ్ వైట్‌లో కొలెస్ట్రాల్ ఉండదు . కాబట్టి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మీ రెగ్యులర్ డైట్‌లో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్‌ను తప్పక చేర్చుకోవాలి.

ఎగ్ వైట్‌లో ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మరియు చాలా తక్కవ క్యాలరీలను కలిగి ఉన్నది. అందుకే ఇది బెస్ట్‌లోకాలరీ బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.ఎగ్ వైట్ వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం వీటి నుండి పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి మరియు ఓస్టియోపొరోసిస్‌ను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

పురుషుల్లో మేల్ హార్మోన్ టెస్టో‌స్టిరోన్ ఉత్పత్తికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అందువల్లే పురుషులు ఎగ్ వైట్‌ను ఎక్కువగా తీసుకోవాలి.విటమిన్ బి12 ఆరోగ్యకరమైన నాడీ సంరక్షణ కొరకు విటమిన్ బి12 అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా విటమిన్ బి12 పొందడానికి ఎగ్ వైట్ అద్భుతంగా సహాయపడుతుంది.

ఎగ్ వైట్‌లో పుష్కలంగా ఐరన్ ఉంటుందని చాలా మందికి తెలియదు . ఇది రెడ్ బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.ఎగ్ వైట్‌లో ట్రేస్ మినరల్స్ మెగ్నీషియం మరియు ఫాస్పరస్‌లు కలిగి ఉన్నాయి. ఈ మినరల్స్ చర్మం అందానికి మరియు కంటి ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి.

మానవుని ఆహారంలో చాలా ఏళ్ల నుంచి గుడ్డు అంతర్భాగంగా ఉంది. అంతే కాదు దీన్ని సంపూర్ణ పోషకాహారంగా పేర్కొన్నారు. వేలకొద్ది పోషక ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి దీన్ని భూమిపైనే అత్యంత విలువైన ఆహారంగా చెబుతారు. అయితే గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని కొంత మంది భావిస్తారు.

అయితే అది కేవలం అపోహ మాత్రమే. అందులో ఏ మాత్రం నిజం లేదు. గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు కలిగి ఉన్నప్పటికీ దీని ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవని ఓ పరిశోధనలో తేలింది. ఒకవేళ టైప్-2 మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలుంటే తప్ప దీని వల్ల ఎలాంటి ముప్పు లేదని పరిశోధకులు.

గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది.

ఉడికించిన గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రోటీన్‌‌ను గ్రహిస్తాయి. గుడ్లలో జుట్టు, గోరు పెరుగుదలకు ముఖ్యమైన బయోటిన్ అనే నీటిలో కరిగే విటమిన్ కలిగి ఉంటాయి, పచ్చి గుడ్లలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇది బయోటిన్ గ్రహించకుండా నిరోధిస్తుంది. గుడ్లను ఉడికించడం ద్వారా ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడం వల్ల మన శరీరాలు గుడ్లలోని బయోటిన్‌ను గ్రహిస్తాయి. అందుకే రోజూ గుడ్డును తినాలంటే ఉడికించుకుని తింటేనే మంచిది.

గుడ్డుని 40 డిగ్రీల కంటే తక్కువగా నిల్వ చేసినప్పుడు షెల్ మీద బ్యాక్టీరియా పెరగడం కష్టం. మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ పొందడానికి మీ షేక్స్‌లో గ్రీకు పెరుగు, సోయా పాలు లేదా గిలక్కొట్టిన గుడ్లతో స్మూతీస్ ను ప్రయత్నించండి. ఇది మీ డైట్‌లో అధిక ప్రోటీన్‌ను అందిస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే గుడ్డు విషయంలో అనేక మందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుడ్డును ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిది. సర్వసాధారణంగా గుడ్డును ఉడకబెట్టి, లేదా ఆమ్లెట్‌లా వేసుకొని తింటా, మరికొందరు గుడ్డును పచ్చిగానే తాగేస్తుంటారు. ఇలా గుడ్డును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు.

అయితే, గుడ్డు ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. ఇలా గుడ్డు ద్వారా పోషకాహారం అందండంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవొచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి కనీసం ఒక్క గుడ్డు అయినా తినండి. యాంటీఆక్సిడెంట్స్ కోసం మాత్రం పచ్చిగుడ్లను మాత్రం లిమిట్ లో తీసుకోండి. ఉడికించిన గుడ్డును మాత్రం బాగానే తినచ్చు.

పచ్చి గుడ్డును అనేక మంది తీసుకుంటారు. వీటిలో ముఖ్య కారణం బాడీ బిల్డింగ్, కండరాల కోసం వారు గుడ్డును పచ్చిగా తీసుకుంటారు. బాడీ బిల్డింగ్ కోసం పచ్చి గుడ్డును ఎక్కువగా షేక్స్, స్మూతీలలో వేసుకొని తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కండరాలను నిర్మించడానికి ఎక్కువ ప్రోటీన్ పొందడానికి మంచి మార్గంగా పరిగణించబడుతుంది. అయితే గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగొచ్చు.

కానీ, ప‌చ్చి కోడిగుడ్ల‌లో సాల్మొనెల్లా అని ఓ ర‌క‌మైన బాక్టీరియా ఉంటుంద‌ట‌. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప ప‌రిమాణంలో ఉంటుంది. గుడ్డును అలాగే ప‌చ్చిగా తాగేస్తే… దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. దీని వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు ప‌చ్చి గుడ్ల‌ను తాగ‌కూడ‌దు. అందువల్ల ప్రతి ఒక్కరు రోజుకో గుడ్డు అయినా తినాలి.

ఉడికించి గుడ్డు తీసుకోవడం చాలా మంచిది. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలు ఇందులో ఎక్కవుగా ఉంటాయి. రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు. అందుకే గుడ్డుని ఉడికించి తినడం వల్ల అనారోగ్యాన్ని నివారించడానికి మంచి కారణం, కానీ అది మాత్రమే కాదు. పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డు ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తాయని చెబుతున్నారు. అందుకే పచ్చి గుడ్లు తినడంతో పోలిస్తే ఉడికించిన గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

గుడ్డును ఉడికించి తింటే చాలా ప్రయోజనాలుంటాయి. ఉడికించిన గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ మీరు కండరాలను పెంచడానికి పచ్చి గుడ్లు తాగటానికి ఇబ్బంది పడతుంటుంటే ఇక నుంచి ఉడికించిన గుడ్లను తీసుకోవచ్చు. ఎందుకంటే ఉడికించిన గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. నిజానికి, వండిన గుడ్లు ప్రోటీన్ పంచ్. ఉడికించిన గుడ్డు ప్రోటీన్‌ను విచ్చినం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, అని స్టాఫ్ చెప్పారు. “మా శరీరాలు పచ్చి గుడ్డులో 50 నుండి 60 శాతం ప్రోటీన్స్‌ని గ్రహిస్తాయి. అదే ఉడికించిన గుడ్డులో 90 శాతం ప్రోటీన్లను గ్రహిస్తుంది.