నిధి అగర్వాల్‌ శింబు పెళ్లి

నిధి అగర్వాల్‌ శింబు పెళ్లి

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబుతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరు త్వరలోనే ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్‌ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ టాక్‌.శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్‌ దర్శకత్వం వహించిన ఈశ్వరన్‌ సినిమాలో నటించారు.

ఆ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత కొంతకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కథనాలు వెలుడుతున్నాయి. ఈ వార్తలపై ఇంతవరకు స్పందించని ఈ జంట త్వరలోనే తమ పెళ్లి కబురు చెప్పేందుకు రెడీ అవుతున్నారట.ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్‌గా మానాడు చిత్రంతో హిట్‌ అందుకున్న శింబు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అటు నిధి సైతం ‘హీరో’, ‘హరిహర వీరమల్లు’ సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది.