Posted [relativedate] at-[relativetime time_format=”H:i”]
మరో బాలీవుడ్, క్రికెట్ ప్రేమ పెళ్లిపీటలెక్కింది. మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ సాగరిక పెళ్లిచేసుకున్నారు. అతికొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య అత్యంత నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. పెళ్లిఫొటోలను జహీర్, సాగరిక స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నెల 27న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్ లో వీరి రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు సంబంధించిన ఆహ్వానపత్రికను సాగరిక స్నేహితురాలు, చక్ దే ఇండియాలో ఆమె సహనటి విద్యా మాల్వంకర్ షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో జహీర్ ఖాన్ సాగరికకు గోవాలో ప్రపోజ్ చేశాడు. జహీర్ ప్రేమను సాగరిక అంగీకరించడంతో ఏప్రిల్ లో వారికి నిశ్చితార్థం జరిగింది.
యువరాజ్ సింగ్ వివాహానికి వారిద్దరూ కలిసి హాజరయిన తర్వాత ట్విట్టర్ లో జహీర్ తన ఎంగేజ్ మెంట్ విషయం ప్రకటించాడు. జహీర్ సాగరికల రిసెప్షన్ శుభలేఖ ఇదే అంటూ ఓ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఒకప్పుడు టీమిండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన జహీర్ బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లిచేసుకుని ఒకింటివాడయ్యాడు. అయితే భారత్ తరపున ఆడే రోజుల్లో సాగరిక కంటే ముందు జహీర్ మరో బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు. కిస్నా హీరోయిన్ ఇషా శర్వాణి, జహీర్ మధ్య చాలా ఏళ్లు ప్రేయాయణం నడిచింది. 2011 వరల్డ్ కప్ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటారనీ వార్తలొచ్చాయి. ఇద్దరూ కలిసి ముంబైలోని పోష్ ఏరియాలో ఓ ఇల్లు కొనుక్కున్నారని, అందులో ఇద్దరూ కలిసి ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ లో సాగరికతో ఎంగేజ్ మెంట్ అయిందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు జహీర్.