మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో…!

Sai Dharam Tej Brother Vaishnav Tej Debut Film Launched Today

ఇప్పటికే అరడజను మందికి పైగా ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో సినీ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి తన స్వశక్తితో మెట్టు మెట్ట్టు ఎక్కుతూ తన మీద పడిన రాళ్ళను సైతం కోటగా మలుచుకుంటూ నిర్మించిన ఈ మెగా స్టార్ సినీ వారసత్వం నుండి నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్‌, కళ్యాణ్ దేవ్‌(శ్రీజ రెండో భర్త) లతో పాటు నాగబాబు కుమార్తె నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. ఇప్పుడు చిరంజీవి చిన్న మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సొంత తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని నిన్న ప్రకటించింది చిత్ర యూనిట్. తమ బ్యానర్ ప్రారంభంలో బస్టర్ హిట్లను కొట్టి గత ఏడాది ఎన్ని సినిమాలు వచ్చినా పేరు తెచ్చుకొని మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు చెందిన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా వైష్ణవ్ తేజ్‌ ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాయి.

ఈ సినినా ద్వారా సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రంగస్థలం తర్వాత ఈ మధ్య కాలంలో సరయిన హిట్ కొట్టని దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈరోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిరంజీవితోపాటు నాగబాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్ హాజరుకాబోతున్నారు. అయితే మొదటి సినిమాకే అబ్బాయి గారికి ఒక బిరుదు లాంటిది తగిలించారండోయ్…అదే పంజా. మరి పవన్ కళ్యాణ్ సినిమా అయిన పంజాని పవన్ క్రేజ్ ని వాడుకోడానికి పెట్టుకున్నారా ? లేక ఇంకేదైనా కారణం ఉందా ? అనేది తెలియాల్సి ఉంది.