ప్రియా ప్రకాష్ సినిమా ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా బన్నీ

ఒరు ఆదార్ లవ్ అంటే జనానికి పెద్దగా గుర్తు రాక పోవచ్చు గాని ప్రియా ప్రకాష్ వారియర్ అంటే మాత్రం కన్ను కొట్టే వీడియో గుర్తురాక మానదు. అప్పుడు వరకు సినిమా పరిచయం లేని ప్రియా ప్రకాష్ కేవలం 2 రోజుల్లో ఆ వీడియో తో పాపులర్ అయిపోయింది. ఓవర్ నైట్ లోనే స్టార్ హోదా సంపాదించింది. ఆ తర్వాత ఆమె పోస్ట్ చేసే ఇంస్టాగ్రామ్ పోస్టులకు ఒక్కొక్క దానికి లక్షల్లో చార్జ్ చేసిందంటే ఆమె క్రేజ్ మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే ఆమెకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. టాలీవుడ్ నుంచి ఏ సినిమా ఒప్పుకున్నట్టు వార్తలు రాకపోయినా, దిల్ రాజు సహ చాలా మంది నిర్మాతలు ఆమె డేట్ల కోసం మేనేజర్లను కేరళకు పంపించారని ప్రచారం జరిగింది. ఆ సంగతి ఎలా ఉన్నా ఆమె నటించిన ఆ సినిమా తెలుగులో రిలీజ్ అవడానికి రంగం సిద్ధమైంది.

‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ టైటిల్ గల సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ సినిమా గా రిలీజ్ చేయనున్నారు. ‘లవర్స్ డే’ పేరుతో ఈ సినిమాను తెలుగులో ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించాలని భావించిన తెలుగు వర్షన్ హక్కుదారు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటకి నుంచి జెఆర్సీ కన్వెన్షన్లో జరపడానికి సన్నాహాలు చేశారు. ఈ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించిన నిర్మాతలు తెలుగు హక్కుదారులు అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రావడం వలన, తమ ప్రాజెక్టుపై క్రేజ్ మరింత పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.