సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు

సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కమిషనర్‌ స్టీఫెన్ రవింద్ర మాట్లాడుతూ.. ‘హీరో సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం.

లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో త్వరలోనే సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తాం’ అని సీపీ వెల్లడించారు. కాగా కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో సెప్టెంబర్‌10న సాయితేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రమాదం నుంచి కోలుకున్న తేజ్‌ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు.