నాది ‘తొలిప్రేమ’ కాదన్న తేజూ

sai dharam tej gives clarity about tholi prema rumors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ వరుసగా చిత్రాలను చేస్తూ దూసుకు పోతున్నాడు. త్వరలో ‘జవాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం వివి వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కరుణాకరన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. గతంలో కరుణాకరన్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ‘తొలిప్రేమ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు ఇది సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ అంటూ ప్రచారం జరుగుతుంది. లేదంటే అదే కథతో కాస్త మార్పులు చేర్పులు చేసి రీమేక్‌ చేయబోతున్నారు ప్రచారం జరుగుతుంది.

sai-dharam-tej

మీడియాలో వస్తున్న వార్తలపై సాయి ధరమ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చాడు. తాను కరుణాకరన్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘తొలిప్రేమ’కు అస్సలు సంబంధం లేదని, అసలు ఆ కథ మరియు ఈ కథ పూర్తి విభిన్నంగా ఉంటుందని. తాను చేస్తున్నది ఒక విభిన్నమైన ప్రేమ కథ అని, కరుణాకరన్‌ మార్క్‌లో ఈ ప్రేమ కథ ఉంటుందని తేజూ చెప్పుకొచ్చాడు. వచ్చే వేసవి ఆరంభంలో వినాయక్‌ చిత్రంతో, వేసవి చివర్లో లేదా దసరా సందర్బంగా కరుణాకరన్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను విడుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తేజూ చెప్పుకొచ్చాడు. ఈ రెండు చిత్రాలతో పాటు దిల్‌రాజు నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు తేజూ సిద్దంగా ఉన్నాడు. అది కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.