సోషల్‌ మీడియా టాక్‌ : ‘అజ్ఞాతవాసి’ కథ ఇదే…

Pawan Kalyan Agnathavasi Movie story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం కోసం ఫ్యాన్స్‌ దాదాపు సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలలు ఆలస్యం అయిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ నేడు విడుదలైంది. టైటిల్‌ ‘అజ్ఞాతవాసి’ అంటూ నేడు అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మరియు ఇతర కొన్ని అంశాలను తీసుకుని కొందరు కథను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక కథ తెగ ప్రచారం జరుగుతుంది.

కథ విషయానికి వస్తే… వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. కొన్ని కారణాల వల్ల ఒక చిన్న కంపెనీలో టెక్కీగా జాయిన్‌ అవుతాడు. చిన్న కంపెనీని పెద్ద కంపెనీల స్థాయికి తీసుకు వెళ్తాడు. ఇంతకు ఆ చిన్న కంపెనీ ఎవరిది, అసలు ఎందుకు పవన్‌ కోట్ల వ్యాపారాలు ఉన్నా కూడా చిన్న కంపెనీలో టెక్కీగా వర్క్‌ చేస్తాడు అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో వారణాసి చాలా కీలక పాత్ర వహించనుందని కూడా కొందరు ఊహిస్తున్నారు. మొత్తానికి సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కథ అదే అయితే త్రివిక్రమ్‌ తన మార్క్‌తో అత్తారింటికి దారేది స్థాయిలో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు.