Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ మొదటి నుండి మేనమామ చిరంజీవిని అనుసరిస్తూ, ఆయన తరహాలో నటించాలని కోరుకుంటూ ఉన్నాడు. డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో కూడా చిరంజీవిని అనుకరించేందుకు సాయి ధరమ్ తేజ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను కూడా అనుకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. చిరంజీవి సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేయడంలో తేజూ ఎప్పుడు ముందు ఉంటున్నాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో గువ్వా గోరింకతో పాటను, సుప్రీంలో అందం హిందోలం అనే పాటను రీ మిక్స్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో తేజూ ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రంలో కూడా ఒక పాటను రీమిక్స్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
వినాయక్‌కు చిరంజీవి పాత పాటలు అంటే చాలా ఇష్టం. చరణ్‌తో చేసిన ‘నాయక్’ చిత్రంలో శుభలేక రాసుకున్న అనే పాటను రీమిక్స్ చేసిన విషయం తెల్సిందే. ఆ పాట మంచి సక్సెస్‌ను దక్కించుకుంది. ఇప్పుడు అదే తరహాలో తేజూ కోసం ‘కొండవీటి దొంగ’ అనే చిత్రంలోని ఛమకు ఛమకు ఛామ్.. అనే పాటను రీమిక్స్ చేయాలని నిర్ణయించారు. ఇళయరాజా స్వరపర్చిన ఆ పాట అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని, ఇప్పటికి కూడా ఆ పాటకు ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. అంతటి సూపర్ హిట్ సాంగ్‌ను స్వల్ప మార్పులు చేసి, లిరిక్స్ కూడా కాస్త మార్చి రీ మిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాకు ఆ పాట ఖచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తుందని వినాయక్ భావిస్తున్నాడు. వీరి ఎంపికను చిరంజీవి కూడా అభినందించినట్లుగా సమాచారం అందుతుంది.