Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినీనటులు రాజకీయల్లోకి రావడం కొత్తేమీ కాదు అలానటి ఎమ్జీఅర్, ఎన్టీఅర్ నుండి నేటి పవన్ కళ్యాణ్ వరకు అందరు సినిమాల నుండి వచ్చిన వారే. ఎంత సినిమా నటులు అయినా స్టార్ డం ఉన్నా వారి గెలుపోటములు మాత్రం వోటర్లే నిర్ణయిస్తారు. కొందరు మాత్రం తమ వాక్చాతుర్యంతో వోటర్లని ఆకర్షిస్తారు. అందులో స్వర్గీయ నందమూరి తారక రామా రావుది అందె వేసిన చేయి. ఇప్పుడు సాయి కుమార్ కూడా అదే కోవలో నడుస్తున్నట్టు ఉన్నారు. సాయి కుమార్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈరోజు నామినేషన్ వేసే సందర్భంగా ఖాదీ లక్ష్మీనారసింహుని ఆశీస్సుల కోసం అనంతపురం వచ్చారు సాయికుమార్. ప్రత్యేక హోదా కోసం మోడీ కాళ్లు అయినా పట్టుకుంటానని… ప్రధాని నరేంద్ర మోడీపై బాలయ్య వ్యాఖ్యలకు సాటి నటుడిగా నేను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. ఆవేశంలో కూడా ప్రధాని మోడీని అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు సాయికుమార్.
ఇప్పుడు సాయి కుమార్ రాజకీయం వంట బట్టించుకున్నారు అని అర్ధం అవుతోంది ఎందుకంటే తాను కన్నడలో నటుడినయినా ఇప్పుడు పోటీ చేస్తున్న చిక్‌బళ్లాపూర్ ఏరియా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి కంచుకోట లాంటిది. ఇప్పుడు మోడీని విమర్శించిన బాలకృష్ణ మీద పొరపాటున ఏదయినా వ్యాఖ్యలు చేస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ వోట్లతో పాటు, బాలకృష్ణకి సన్నిహితులయిన రాజకుమార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ వోట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మనకి ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నాడో ఏమో. అలాగే ఈ సారి ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణను పిలవడం లేదని ఆయన ప్రకటించారు. 2008 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన సాయి కుమార్ ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.