ఆర్‌ మల్టీస్టారర్‌కు గౌతమిపుత్ర రైటర్‌…!

Sai Madhav Get Chanced Dialog Writer In Multistater Movie

టాలీవుడ్‌లో మాటల రచయితల్లో అతి కొద్ది మంది మాత్రమే స్టార్స్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాగా, ఇటీవల సాయి మాధవ్‌ బుర్రా అద్బుతమైన మాటలతో ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు అలరిస్తున్నాడు. గత సంవత్సరం పలు చిత్రాలకు మాటల రచయితగా వ్యవహరించిన సాయి మాధవ్‌ బుర్రా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి గాను అద్బుతమైన డైలాగ్స్‌ను రాయడం జరిగింది. ‘బాహుబలి’ చిత్రానికి కూడా ఈయన మాటల రచయితగా ఛాన్స్‌ను దక్కించుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ మూవీలో ఈ కొత్త మాటల మాంత్రికుడు తన కలంను పెట్టబోతున్నాడు.

raja-mouli

సాయి మాధవ్‌ బుర్రా ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి డైలాగ్స్‌ రాస్తున్నాడు. దాంతో పాటు మరి కొన్ని చిత్రాలకు కూడా పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ను రాసే పనిలో ఉన్నాడు. ఈ సమయంలోనే ఈయనకు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీకి డైలాగ్స్‌ రాసే అవకాశం దక్కింది. అద్బుతమైన మల్టీస్టారర్‌ చిత్రాన్ని జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడు. అంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి డైలాగ్‌ రైటర్‌గా ఛాన్స్‌ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మల్టీస్టారర్‌ మూవీకి ఖచ్చితంగా సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ హైలైట్‌గా నిలుస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

sai-madav-movie