అక్కినేని – నందమూరి అభిమానులకి డబుల్ బొనంజా !

NTR-And-ANR-look-in-ntr-bio

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కథానాయకులుగా ఇద్దరూ ఇద్దరే. పౌరాణిక చిత్రాల్లో తనకి తిరుగులేదని ఎన్టీ రామారావు నిరూపిస్తే , సాంఘిక చిత్రాల్లో ఎదురులేదని ఏఎన్నార్ చాటారు. సోలో హీరోలుగా వరుస సినిమాలు చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా కలిసి నటించారు. విజయాలను అందుకునే విషయంలో పోటీపడుతూనే ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. అందువలన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ANR First look

ఈ రోజున ఏఎన్నార్ జయంతి కావడంతో, ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రను పోషిస్తోన్న సుమంత్ లుక్ ను ఉదయం రిలీజ్ చేశారు. అయితే అభిమానులను ఆశ్చర్యంలో నెట్టే విధంగా, తాజాగా మరో పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. అలాంటి ఎన్టీఆర్ – ఏఎన్నార్ లను ఓ పక్కన చేర్చి లేటెస్ట్ ఫోటోను రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ కు అగ్గిపెట్టె ద్వారా సిగరెట్ వెలిగిస్తున్న ఏఎన్నార్ ను చూడవచ్చు. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపిస్తుండగా, ఏఎన్నార్ రోల్ లో సుమంత్ దర్శనమిచ్చారు. దీంతో ఈరోజు నందమూరి అక్కినేని అభిమానులకి డబుల్ బొనంజా అని చెప్పవచ్చు.

NTR And ANR