శ్రీరెడ్డి హైకోర్ట్‌లో పిటీషన్‌.. ప్రభుత్వంకు నోటీస్‌లు…!

Sri Reddy Petition High Court served notices

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో ఆడవారిపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారని, కొన్ని వందల మంది లైంగికంగా టాలీవుడ్‌లో చిత్ర హింసలు పడుతున్నారు అంటూ శ్రీరెడ్డి గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే. కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా ఈమె చేస్తున్న ఉద్యమం పీక్స్‌కు చేరిన సమయంలో చిన్న తప్పదం వల్ల మొత్తం నీరుగారి పోయింది. ఆ సమయంలోనే శ్రీరెడ్డి హైకోర్టులో కాస్టింగ్‌ కౌచ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ప్రభుత్వం కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు శూన్యం అని, ఎంతో మంది ఆవేదనతో ఇబ్బందులు పడుతున్నారు అంటూ శ్రీరెడ్డి పిటీషన్‌లో పేర్కొనడం జరిగింది.

sree-reddy-high-court

నేడు శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ పిటీషన్‌పై హైకోర్టులో చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తీసుకుంటున్న చర్యలు ఏంటో చెప్పాలిందిగా ఆదేశించింది. టాలీవుడ్‌లో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటో కూడా తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. సినిమా పరిశ్రమల్లో లైంగిక వేదింపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అందుకు ఏం చేస్తన్నారో తెలియజేయాలంటూ హైకోర్టు ప్రభుత్వంకు నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాని కోర్టు నోటీసులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్రంకు నోటీసులు ఇవ్వడం జరిగింది.3

sree-reddy