Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలయాళ ‘ప్రేమమ్’ చిత్రం తెలుగులో విడుదల కానప్పటికి ఎక్కువ శాతం ప్రేక్షకులకు సాయి పల్లవి ఆ చిత్రంతోనే పరిచయం అయ్యింది. ప్రేమమ్ చిత్రంలో చక్కగా నటించి మెప్పించిన సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానించడం మొదలు పెట్టారు. ఆ సమయంలోనే ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు సాయి పల్లవి వచ్చింది. తెలుగులో మొదటి సినిమాతోనే సాయి పల్లవికి స్టార్ ఇమేజ్ దక్కింది. మొదటి సినిమా తర్వాత ఆమెతో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు అంటే ఆమెకు ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం నానితో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి మరియు శర్వానంద్‌తో కలిసి ఒక సినిమాను చేస్తున్న సాయి పల్లవి తమిళంలో కూడా పలు చిత్రాలు చేస్తూ ఉంది. తాజాగా ఈమె నటించిన ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించింది. ఆ సమయంలోనే ఒక మీడియా పర్శన్ సాయి పల్లవిని మయాళి అంటూ సంబోధించాడు. మలయాళి అమ్మాయి అనడంతో సాయి పల్లవికి కోపం వచ్చింది. తాను మలయాళి కాదని, తాను ఒక తమిళ అమ్మాయిని అంటూ చెప్పుకొచ్చింది. ‘ప్రేమమ్’ చిత్రంతో గుర్తింపు రావడం వల్ల అంతా కూడా నన్ను మలయాళి అనుకుంటున్నారు. కాని నేను పక్కా తమిళ అమ్మాయిని అంటూ మీడియాకు చెప్పుకొచ్చింది. మళ్లీ ఎప్పుడు కూడా తాను మలయాళి అని మీడియాలో కనిపించవద్దు, వినిపించవద్దని కోరింది.