నెచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సినిమా అంటే చాలు అది బ్లాక్‌బస్టర్ అనేంతగా సాయి పల్లవి పరిశ్రమలో గుర్తింపు పొందింది. గ్లామర్‌కు పాత్రలకు నో చెబుతూ తన సహజమైన నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఏ విషయంపై కూడా ముక్కుసూటిగా స్పందించే సాయి పల్లవి తన పెళ్లిపై కూడా అదే తీరుతో వ్యవహరించింది.
ప్రస్తుతం సాయి పల్లవి తన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్స్, మీడియా ఇంటర్య్వూలతో శ్యామ్ సింగరాయ్ టీం బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సాయి పల్లవికి తన పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఎలాంటి బిడియం చూపించకుండా ‘నాకు అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకు ఇంకా 29 ఏళ్లు మాత్రమే. 30 ఏళ్లు వచ్చాక అప్పుడు పెళ్లి గురించి ఆలోస్తా’ అంటూ తనదైన శైలిలో ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. కాగా సాయి పల్లవి నటించిన మరో చిత్రం విరాట పర్యం విడుదల కావాల్సి ఉండగా.. తమిళంలో ఓ మూవీకి చేస్తోంది.