నక్సలైట్ గా సాయి పల్లవి !

Sai Pallavi May Act Naxalite Getup In Virata Parvam 1992 Movie

మ‌ల‌యాళీ భామ సాయి ప‌ల్లవి ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. అందంతో పాటు మంచి అభిన‌యం ఉన్న ఈ న‌టి ఇటు తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తుంది. ఇటీవ‌ల ప‌డిప‌డిలేచే మ‌న‌సు అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది సాయి ప‌ల్ల‌వి. ఆమె త్వరలో నక్సలైట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. నీదీ నాదీ ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే చిత్రం చేయబోతుంది. ఈ మూవీలో రానా లీడ్ రోల్ లో నటిస్తుండగా, సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ మూవీ లో సాయి పల్లవి నక్సలైట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ఫై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మ‌రి తొలి చిత్రంతో మంచి హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు రానా, సాయి ప‌ల్ల‌వి వంటి స్టార్ ఆర్టిస్ట్స్‌తో సినిమాని ఏ రేంజ్‌లో తీస్తాడో చూడాలి మ‌రి. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె చిత్రంలో నటిస్తుంది సాయిప‌ల్ల‌వి.