మానసిక సమస్యతో బాధపడుతున్న సాయి పల్లవి

మానసిక సమస్యతో బాధపడుతున్న సాయి పల్లవి

వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’.2019లో మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మంచి హిట్‌ని సొంతం చేసుకుంది. త్వరలో ఈ మూవీ ఓటీటీ ద్వారా తెలుగులో సందడి చేయనుంది.

‘అనుకోని అతిథి’ పేరుతో ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో టీజ‌ర్ విడుద‌లైంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. మానసిక సమస్యతో బాధపడే క్యారెక్టర్‌లో సాయి పల్లవి యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.