మీ ప్రశంసలకు విధేయురాలిని సార్‌

మీ ప్రశంసలకు విధేయురాలిని సార్‌

నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఇండియాలోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్‌, నాగ చైతన్య నటనకు విశేష స్పందన వస్తోంది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా లవ్‌స్టోరీ మూవీ గురించే చర్చించుకుంటారు. అంతేగాక లవ్‌స్టోరీపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల, హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సైతం ఈ మూవీపై తన రివ్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు. తన ట్వీట్‌లో సాయి పల్లవి గురించి బెబుతూ.. ‘ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అసలు ఆమెకు బోన్స్‌ ఉన్నాయా? స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్‌ చేయడం ఇంతవరకు చూడలేదు’ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన సాయి పల్లవి, మహేశ్‌ కామెంట్స్‌పై స్పందించింది. మహేశ్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ.. ‘మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్‌. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్‌ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివించింది సార్‌’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరు కూడా ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

లవ్‌స్టోరీ సినిమా చూసిన మహేశ్‌ బాబు ట్వీట్‌ చేస్తూ.. ‘శేఖర్‌ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని ప‌ర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్‌ చేంజర్‌ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈమెకు అసలు బోన్స్‌ ఉన్నాయా? స్క్రీన్‌పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహ‌మాన్ స‌ర్ గ‌ర్వ‌ప‌డే స‌మ‌యం’ ఇది అంటూ లవ్‌స్టోరీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఆయన ట్వీట్‌కు ఎఆర్‌ రెహమాన్‌ కూడా స్పందిస్తూ ధన్యవాదలు తెలిపిన సంగతి తెలిసిందే.