హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోతో కాకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులకు దగ్గరైంది ఈ మలయాళీ బ్యూటీ. తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే పూజా తెరంగేట్రం గురించి పలు వార్తలు వచ్చినా తాజాగా వాటిని నిజం చేస్తూ తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను రివీల్ చేసింది.
తమిళ స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకత్వంలో చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ నటుడు సముద్రఖని సైతం ఉన్నారు. ఇక ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి అక్క సాయిపల్లవిలా పూజా కన్నన్ హీరోయిన్‌గా ఏ మేరకు మెప్పిస్తుందనే చూడాల్సి ఉంది.